అందరూ కలిసి నాకు వెన్నుపోటు పొడిచారు... తెర వెనుక నాగబాబు కష్టం!
on Aug 7, 2025

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ మొదలై పుష్కరం పూర్తైన సందర్భంగా 12 ఏళ్ళ సంబరాలు చేసుకుంటోంది. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి కొత్త పాత కమెడియన్స్ అంతా కూడా మళ్ళీ ఒక చోట చేరారు. అలాగే జడ్జ్ నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలానే స్కిట్స్ కి పడీపడీ నవ్వుతూ ఉన్నారు. ఐతే ఇందులో ఆది ఒక స్కిట్ వేసాడు. అందులో ఎవరు ఎవరిని పొడిచి పైకొచ్చారో చెప్పాడు. జబర్దస్త్ లో అందరూ కట్టప్పలే బాహుబలులు ఎవరూ లేరు. ఒకరు పైకి రావడానికి ఇంకొకరు టీం లీడర్స్ ని పొడిచి పైకి వచ్చినవాళ్లే అంటూ చెప్పాడు. దాంతో నాగబాబు ఈ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యారు. చలాకి చంటిని అందరూ పొడిచారు అని చెప్పాడు ఆది.
ఆది నీకు అసలు విషయం తెలియడం లేదు. ఇక్కడ ఉన్న అందరూ నన్ను పొడిచారు..ఆ విషయం నీకు ఇంకా తెలియడం లేదు. ఈ స్టేజి మీద నన్ను ప్రతీవాళ్ళూ పొడిచారు. చంటి వీపు జల్లెడ ఐతే నాకు అసలు వెనక ఏమీ లేదు. వేరే స్కిన్ కప్పుకుని తిరుగుతున్నా అంటూ చాలా ఫీలయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో చమ్మక్ చంద్ర, అదిరే అభి, రైజింగ్ రాజు, బలగం వేణు, హైపర్ ఆది, గెటప్ శీను, ధనరాజ్, షకలక శంకర్ ఇలా అందరూ ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. ఎవరి గురువులకు వాళ్లకు కాళ్ళు కడిగి వాళ్ళ గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకున్నారు. ఇక చాన్నాళ్ల తర్వాత నాగబాబు నవ్వును మళ్ళీ జబర్దస్త్ స్టేజి మీద వింటున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



